చైతు ఛాన్స్ ఇస్తాడా..?

నాగచైతన్య ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. మొన్నామధ్య ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. చైతు హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నాడు. దానికి కథ సిద్ధం చేసి చైతుకి వినిపించాడు కూడా కానీ ఎందుకో చైతు ఆ ప్రాజెక్ట్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో ఆయన ‘అమీ తుమీ’ సినిమాను తెరకెక్కించాడు. చిన్న సినిమాగా వచ్చిన అమీతుమీ ప్రేక్షకాదరణ పొందింది. ‘జెంటిల్ మెన్’ తరువాత ‘అమీతుమీ’తో మరోసారి హిట్ కొట్టిన దర్శకుడికి చైతు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

దీంతో మరోసారి చైతుని సంప్రదించే పనిలో పడ్డారట ఇంద్రగంటి. అయితే ఒకవేళ చైతు ఇప్పుడు కూడా ఓకే చెప్పకపోతే మరోహీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఈ దర్శకుడు. అయితే ఇప్పటికే చందు మొండేటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు మరికొన్ని కథలను వింటోన్న చైతు ఇంద్రగంటి ప్రాజెక్ట్ కు ఓకే చెబుతాడో.. లేదో..
చూడాలి!