HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ పేర్లు లీక్‌ చేస్తూ.. నూతన్‌ నాయుడు వీడియో వైరల్‌

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ పేర్లు లీక్‌ చేస్తూ.. నూతన్‌ నాయుడు వీడియో వైరల్‌

3 20

తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ సీజన్-3 రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే హౌస్‌లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. ఒకరిద్దరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చినా మిగతా పేర్లు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. ఆ రహస్యాన్ని సీజన్-2 పార్టిసిపెంట్ నూతన్ నాయుడు బయటపెట్టేశాడు. బిగ్‌బాస్ షో పోటీదారులు వీరేనంటూ 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

నూతన్ నాయుడు వెల్లడించిన పేర్లలో నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, నటుడు వరుణ్ సందేశ్-వితికా షెరు(జంట), సీరియల్ నటుడు రవికృష్ణ, సీరియల్ యాక్టర్ అలీ రెజా, టీవీ9 న్యూస్ యాంకర్ జాఫర్, నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్, సీరియల్ నటి రోహిణి, డబ్‌స్మాష్ స్టార్ అషూరెడ్డి ఉన్నారు.

ఈ జాబితా తనకు ఎలా వచ్చిందీ చెప్పని నూతన్ నాయుడు.. రేపటి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టేది మాత్రం కచ్చితంగా వీళ్లేనని చెబుతున్నాడు. అయితే అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే కంటెస్టెంట్ల విషయంలో స్పష్టత రానుంది. కాగా ఆదివారం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షో ఆది నుంచి వివాదాస్పదం అవుతోంది. షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు విద్యార్థి సంఘాలు షోను నిలిపి వేయలంటూ ధర్నా చేస్తుండగా.. బిగ్‌బాస్‌ ప్రసారంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!