HomeTelugu Trendingన్యూ ఇయర్‌ సందర్భంగా 'దేవర' అప్డేట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌

న్యూ ఇయర్‌ సందర్భంగా ‘దేవర’ అప్డేట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌

Devara movie update
న్యూ ఇయర్‌ సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చాడు ఎన్టీఆర్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘దేవ‌ర’. ఈ మూవీని ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ హైప్స్‌ ఏర్పడ్డాయి. ఈ క్రమంలో నేడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ అందించారు. దేవ‌ర గ్లింప్స్‌ను జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఎన్టీఆర్‌ ప్ర‌క‌టించాడు.

దీంతోపాటుగా కొత్త పోస్ట‌ర్‌ను విడుదల చేశారు‌. ఈ పోస్ట‌ర్‌లో స‌ముద్రాన్ని చీల్చుకుంటూ వ‌స్తోన్న ప‌డ‌వ‌లో ఎన్టీఆర్ నిల్చుని క‌నిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ సినిమాలో స‌ముద్ర తీర ప్రాంతాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడే నాయ‌కుడి పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌బోతున్న‌ట్లు టాక్‌.

కొర‌టాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్‌ నటి, శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. భారీ బ‌డ్జెట్‌తో హ‌రి కోస‌రాజు, సుధాక‌ర్ మిక్కిలినేనితో క‌లిసి ఈ సినిమా క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా విడుదల కానుంది. ఫ‌స్ట్ పార్ట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu