Devara Heroine Cinema Ulajh on OTT:
బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో కలిసి తొలిసారి నటించిన దేవర: పార్ట్ 1 విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్‌లో జాన్వీకి ఇది మొదటి చిత్రం కావడంతో, ఈ సినిమా ఆమెకు చాలా ముఖ్యంగా మారింది. ఈ భారీ చిత్రాన్ని రేపు థియేటర్లలో విడుదల చేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై అంచనాలుగు భారీ స్థాయిలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే, జాన్వీ కపూర్ ఇటీవల నటించిన స్పై థ్రిల్లర్ ఉలజ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ, ఈ చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ రేపు విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి, కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఉలజ్ చిత్రానికి జాతీయ అవార్డు విజేత సుధాన్షు సారియా దర్శకత్వం వహించగా, పర్వేజ్ షేక్ మరియు సుధాన్షు కలిసి కథను రాశారు. ఈ చిత్రంలో జాన్వీతో పాటు గుల్షన్ దేవయ్య, రొషన్ మాథ్యూ, రాజేష్ టైలాంగ్, మీయాంగ్ చాంగ్, సచిన్ ఖేదేకర్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి వంటి ప్రముఖ నటులు నటించారు. వినీత్ జైన్ ఈ సినిమాను నిర్మించారు.
ఉలజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టకపోయినప్పటికీ, జాన్వీ కపూర్ నటనపై ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. టాలీవుడ్‌లో ఆమె దేవరతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
Read More: Devara ఓటిటి రిలీజ్ విషయంలో ట్విస్ట్ అదే