టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా కోస్టల్ ఏరియా బ్యాక్‌డ్రాప్ స్టోరీతో రూపొందుతోంది. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోగా.. తాజాగా నెక్ట్స్ షెడ్యూల్ గురించి ఫ్యాన్స్ కోసం అప్‌డేట్ ప్రకటించారు మేకర్స్. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణకు సిద్ధమైనట్లు వెల్లడించారు.
‘దేవర’ మూవీ టీమ్ ట్వీట్ విషయానికొస్తే.. ‘షార్ట్ బ్రేక్, కొన్ని రోజుల రిహార్సల్స్ తర్వాత భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ తీసేందుకు నేటి నుంచి సెట్స్‌పైకి తిరిగొచ్చాం’ అని ప్రకటించారు. ఇప్పటికే మూడు భారీ షెడ్యూల్స్ కంప్లీట్ కాగా.. ఈ కొత్త షెడ్యూల్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే ఈ మూవీ టాకీ పార్ట్ మొదలు పెట్టకముందే కొరటాల యాక్షన్ పార్ట్ మొత్తం పూర్తి చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ‘దేవర’ చిత్రానికి సముద్రంలో చిత్రీకరించే ఈ సీన్లే కీలకం కానున్నాయి. ఇప్పటికే మూడు భారీ షెడ్యూల్స్ కంప్లీట్ కాగా.. ఈ కొత్త షెడ్యూల్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే ఈ మూవీ టాకీ పార్ట్ మొదలు పెట్టకముందే కొరటాల యాక్షన్ పార్ట్ మొత్తం పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
.













