దర్శకుడిగా స్టార్ హీరో!

తమిళ స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతోన్న నటుడు ధనుష్. అతడు మంచి నటుడు మాత్రమే కాదు.. పాటలు రాయగల సత్తా ఉంది. మంచి సింగర్ కూడా.. నిర్మాతగా కూడా తన టాలెంట్ ను నిరూపిస్తున్నాడు. ఇన్ని రకాల టాలెంట్స్ ఉన్న ధనుష్ ఇప్పుడు దర్శకత్వం వైపు కూడా మొగ్గు చూపుతున్నాడు. ‘పవర్ పాండి’ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాలో ప్రధాన పాత్రల కోసం రాజ్ కిరణ్, చాయసింగ్ లను ఎంపిక చేసుకున్నాడు. ఛాయాసింగ్ గతంలో ధనుష్ తో కలిసి ‘తిరుడా తిరుడి’. అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన నటన నచ్చడంతో ధనుష్ తన సినిమాలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ధనుష్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. నటుడిగా, నిర్మాతగా, సక్సెస్ సాధించిన ధనుష్ దర్శకుడిగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి!