మహేష్ అతడికి ఛాన్స్ ఇచ్చినట్లేనా..?

కంత్రి, బిల్లా, శక్తి వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు మెహర్ రమేష్. 2013 లో ఆయన రూపొందించిన ‘షాడో’ సినిమా తరువాత మరో హీరో ఆయనకు అవకాశం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయితే అతడికి హీరోలతో మంచి పరిచయాలే ఉన్నాయి.

ముఖ్యంగా మహేష్ బాబు.. అతడితో మెహర్ కు మంచి స్నేహం ఉంది. గతంలో మహేష్ నటించిన ‘బాబీ’ సినిమాలో మెహర్ sరమేష్ కూడా నటించాడు. మొన్నామధ్య మహేష్ తో ఓ యాడ్ ను కూడా షూట్ చేశాడు. తన స్టైలిష్ మేకింగ్ తో మహేష్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు.

అప్పటినుండి మహేష్ తో మెహర్ ఎక్కువగా కనిపిస్తున్నాడు. దీంతో మెహర్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పటికే మహేష్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మురుగదాస్ సినిమా, వెంటనే కొరటాల శివ సినిమా సినిమా లైన్ లో ఉంది. మరి ఈ గ్యాప్ లో మెహర్ కు అవకాశం ఇవ్వడం కుదురుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.