దిల్ రాజు చేతులో ‘కృష్ణార్జున యుద్ధం’!

నాని హీరోగా వేణూశ్రీరామ్ దర్శకత్వంలో ‘ఎంసిఏ’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా డిసంబర్ నెలలో పేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తరువాత నాని.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ అనే సినిమాను అంగీకరించాడు. ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాపై మొదటి నుండి కూడా దిల్ రాజు కన్ను పడింది. ఇప్పుడు ఈ సినిమా ఏపీ, నైజాం రైట్స్ ను దక్కించుకున్నాడు దిల్ రాజు. దీంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించనుంది.