HomeTelugu NewsF2 టీమ్‌కి దిల్‌ రాజు ఖరీదైన గిఫ్ట్స్ !

F2 టీమ్‌కి దిల్‌ రాజు ఖరీదైన గిఫ్ట్స్ !

12 1దిల్ రాజు నిర్మాతగా ఈమధ్య కాలంలో అందుకున్న బిగ్గెస్ట్ హిట్ ‘ఎఫ్‌ 2’. సంక్రాతికి విడుదలైన ఈ సినిమా 50 రోజులు పూర్తిచేసుకుంది. అన్ని ఏరియాల్లోనూ బ్రహ్మాండంగా ఆడిన సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. నిర్మాత దిల్ రాజుకు ఈ ప్రాజెక్ట్ భారీ లాభాల్ని మిగిల్చింది. ఆయన గత సినిమాల నష్టాలన్నీ ఈ లాభాలతో తీరిపోయాయట. అందుకే ఆయన సినిమా దర్శకత్వ విభాగంలో ఉన్న అందరికీ ఖరీదైన లేటెస్ట్ ఐఫోన్స్ బహుమతిగా ఇచ్చారట. ఇకపోతే దిల్ రాజు, అనిల్ రావిపూడి కలయికలో ‘పటాస్, రాజా ది గ్రేట్’ తరవాత ఇది మూడవ హిట్ కావడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu