దిల్ రాజు ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. చాలా కాలం తరువాత చిరు నటిస్తోన్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా జనవరి 11న విడుదలవుతుండగా.. జనవరి 12న బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలవుతుంది. అయితే ఈ రెండు సినిమాలకు పోటీగా దిల్ రాజు తన ‘శతమానం భవతి’ సినిమాను విడుదల చేస్తున్నాడు. రెండు అగ్రహీరోల సినిమాలు థియేటర్స్ లో ఉండగా దిల్ రాజు తన సినిమాను రంగంలోకి దింపడం పట్ల ఆయన పెద్ద సాహసం చేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు దిల్ రాజు తెలివితేటలు వలనే ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపుతున్నాడు.
చిరంజీవి సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది.. శాతకర్ణి కాన్సెప్ట్ ను నమ్ముకుంటూ బరిలో దిగుతుంది. ఇక శతమానం భవతి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది. సంక్రాంతి సెలవులు అందులోనూ పల్లెటూరి నేపధ్యం గల సినిమా. బంధాలు, అనుబంధాలకి సంబంధించిన కథాంశం. కనుక ఖచ్చితంగా ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. పైగా చిరు, బాలయ్య ల సినిమాలకు టికెట్స్ దొరకకపోయినా.. ఆ టికెట్స్ ఈ సినిమాకు తెగడం ఖాయం. ఈ నమ్మకంతోనే దిల్ రాజు తన సినిమా రిలీజ్ చేస్తున్నాడని టాక్. మరి తన ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో.. చూడాలి!