HomeTelugu Trending'ఆర్‌ఎక్స్‌ 100' సీక్వెల్‌.. కొత్త అందాల కోసం వెతుకులాట!

‘ఆర్‌ఎక్స్‌ 100’ సీక్వెల్‌.. కొత్త అందాల కోసం వెతుకులాట!

4 26
టాలీవుడ్‌లో ‘ఆర్‌ఎక్స్‌ 100’ మూవీ సూపర్‌ హిట్‌ సాధించింది. రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 20 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో కార్తికేయ, సాయల్‌ రాజ్‌ పుత్‌ హీరో, హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ తెలుగులో మోస్ట్ హ్యపెనింగ్ హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటుంది. హీరో కార్తికేయ కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తి అయిన సందర్బంగా డైరెక్టర్‌ అజయ్ భూపతి సోషల్ మీడియాలో ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన సీక్వెల్ ను ప్రకటించాడు. ఖచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ ను తీస్తాను. సీక్వెల్ స్టోరీ కూడా కార్తికేయకు సూట్ అయ్యేలా ఉంటుందని అన్నాడు. ఇక ఈ సీక్వెల్ కు హీరోయిన్ గా కొత్త అందాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారట. మొదటి పార్ట్ కథకు సీక్వెల్ గా అన్నట్లుగా కాకుండా పూర్తి విభిన్నమైన కథాంశంతో సీక్వెల్ రూపొందే అవకాశం ఉంది. కాగా ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంలో పాయల్‌ రాజ్‌ పుత్‌ హైలైట్‌గా నిలిచింది. ఆమె చేసిన ఎక్స్‌పొజింగ్‌ ఈ చిత్రానికి మరింత క్రేజ్‌ని తెచ్చిపెట్టింది అనడంలో సందేహం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu