క్రిష్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?

రొటీన్ చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ.. దర్శకుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు క్రిష్. ఇటీవల ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాతో హిట్ కొట్టిన ఈ దర్శకుడితో పని చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపధ్యంలో క్రిష్, వెంకటేష్ తో సినిమా చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి విషయం తెలియడం లేదు. ఇది పక్కన పెడితే క్రిష్ యంగ్ హీరోలతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట.
ఒకవేళ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల డేట్స్ గనుక సెట్ కాకపోతే కొత్త వారితో అయినా.. ఆ సినిమాను కంప్లీట్ చేయాలనేది క్రిష్ ప్లాన్. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు కూడా చకచకా జరుగుతున్నాయని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది. శాతకర్ణి తరువాత బాలీవుడ్ లో సినిమా చేయాలనుకున్న క్రిష్ తన మనసు మార్చుకొని మళ్ళీ టాలీవుడ్ మల్టీస్టారర్ అంటుంటే కథలో ఇంకెంత కొత్తదనం దాగి ఉందో.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.