HomeTelugu Newsనా సినిమా ఫ్లాపైంది.. పూర్తి బాధ్యత నాదే

నా సినిమా ఫ్లాపైంది.. పూర్తి బాధ్యత నాదే

5 25ప్రముఖ హాస్యనటులు రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిఠాయి’ చిత్రం ఇటీవల విడుదలై పరాజయం పాలైంది. సినిమా ఫ్లాప్‌ అవడానికి తానే బాధ్యత వహిస్తున్నానని, సినిమా ఫ్లాప్‌ అవుతుందని తనకు ముందే తెలుసని శనివారం ఓ పోస్ట్‌లో పేర్కొంటూ ట్విటర్‌ నుంచి తప్పుకొన్నారు రాహుల్‌. తాజాగా ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ కుమార్‌ ‘మిఠాయి’ చిత్రం గురించి స్పందించారు. ఓ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేశారు. ‘నా సినిమా ఫ్లాపైంది. స్టేక్‌హోల్డర్లు డబ్బులు పోగొట్టుకున్నారు. ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వని సినిమాను తెరకెక్కించినందుకు పూర్తి బాధ్యత నాదే. మరెవ్వరిదీ కాదు’

‘మరోపక్క ‘మిఠాయి’ సినిమా తీసినందుకు నాకు గర్వంగానూ ఉంది. మున్ముందు నేను తీసే సినిమాలు హిట్‌ అయినా ‘మిఠాయి’ సినిమాను చూసి గర్వపడుతుంటా. సినిమా హిట్‌ అయితే సక్సెస్‌ పార్టీ చేసుకుందాం. ఫ్లాపైతే ఫెయిల్యూర్‌ పార్టీ చేసుకుందామని ముందు నుంచీ చిత్రబృందానికి చెబుతూనే ఉన్నాను. సినిమా విడుదలయ్యాక చిత్రబృందంలోని ఒక్కొక్కరూ తప్పుకోవడానికి ప్రయత్నించారు. ఒకవేళ సినిమా రూ.100 కోట్లు రాబట్టి ఉంటే ప్రతి ఒక్కరూ క్రెడిట్‌ తీసుకునేవారు. ఫ్లాపైతే దర్శకుడి మీదకే నెట్టేస్తారు. కానీ నేను ఒంటరిగా లేను. నాతో పాటు కెమెరామెన్‌ రవి వర్మన్‌ నీలమేఘం, సౌండ్‌ డిజైనర్‌ సచిన్‌ సుధాకరానంద్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ వివేక్‌ సాగరంద్‌ ఉన్నారు. సినిమా ఎందుకు ఫ్లాపైందో తర్వాత చెబుతా. నేను బాధలో ఉన్నాను కానీ కుంగిపోలేదు. ఈ సినిమా ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. నేను ప్రతీక్షణాన్ని ఆస్వాదించాను.’ అని వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu