HomeTelugu Big Storiesదిశకు న్యాయం.. నిందితుల ఎన్‌కౌంటర్

దిశకు న్యాయం.. నిందితుల ఎన్‌కౌంటర్

1 5

దేశవ్యాప్తంగా.. దిశ హత్యాచారం కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం సంచలనం రేపుతోంది. మొత్తం నలుగురినీ దిశను తగులబెట్టిన చోటే కాల్చిచంపారు పోలీసులు. నవంబర్ 27 వ తేదీ రాత్రి 9:30గంటల ప్రాంతంలోదిశ స్కూటీని తోడుంపల్లి పంచర్ చేసి ఆమెను అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పాశవికంగా అత్యాచారం చేసి, అక్కడి నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న చటాన్ పల్లి వద్దకు తీసుకెళ్లి ఆమె బ్రతికి ఉండగానే పెట్రోల్, డీజిల్ పోసి కాల్చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని, నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని, చేతకాకపోతే తమకు అప్పగించాలని చెప్పి ప్రజలు ఆగ్రహంతో రోడ్డుమీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కాగా షాద్ నగర్ కోర్టు నిందితులను 14 రోజుల రిమాండ్ విధించడం.. ఆ తరువాత ఇంకా అనేక కోణాల్లో దర్యాప్తు చేయాలి కాబట్టి నిందితులను 10 రోజులపాటు కష్టడికి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కోర్టు వారం రోజులు కష్టడికి ఇచ్చింది. కాగా, 5 వ తేదీన జైలులోనే నిందితులను పోలీసులు విచారించారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం నిందితులను చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి విచారిస్తుండగా.. పోలీసుల వద్దనున్న తుపాకులు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. కుదరకపోవడంతో పారిపోవడానికి ప్రయత్నించారని, మరో దారిలేక నలుగురు నిందితులను కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. దిశను ఎక్కడైతే కాల్చి చంపారో.. అక్కడే నిందితులను ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. దిశ కేసు ఎన్నో మలుపులు తిరిగి చివరకు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ తో ముగిసింది. తెల్లవారుజామున 03.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన తెలుస్తోంది. కోర్టు అనుమతితో చర్లపల్లి జైలు నుంచి నలుగురు నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్న మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu