కన్నుల పండుగ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దీపావళి సర్‌ప్రైజ్


టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌'(రౌద్రం రణం రుధిరం). రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో అలియాభట్‌, ఓలివియా మోరీస్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గన్‌, నటి శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి.

ఇక తాజాగా దీపావళి కానుకగా ఆర్‌ఆర్‌ఆర్‌(రణం, రుధిరం, రౌద్రం) చిత్ర యూనిట్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ట్విటర్‌ అకౌంట్‌లో శుక్రవారం రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి ముచ్చటిస్తున్న ఫోటోలను పోస్టు చేసింది. ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. అందరి జీవితాల్లో ఈ దీపావళి మరిన్ని వెలుగులు నింపాలని పేర్కొంది. కన్నుల పండుగగా ఉన్న ఈ ఫోటోల్లో ముగ్గురు సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

CLICK HERE!! For the aha Latest Updates