‘తలైవి’ సినిమాలో హీరో ఎవరో గుర్తుపట్టారా!

జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఆదివారం ప్రారంభమైన సినిమా గురువారం అంటే ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ లో భాగంగా ఈరోజు అమ్మ జయలలిత, ఎంజిఆర్ మధ్య కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. అమ్మ జయలలిత పాత్రలో కంగనా నటిస్తుంటే… ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామీ నటిస్తున్నారు.

ఎంజీఆర్ అంటే తమిళనాడు ప్రేక్షకులకు ఆరాధ్యదైవం. అయన సినిమా విడుదల అవుతుంది అంటే థియేటర్ల ముందు క్యూలు కట్టేవారు. ఎంజీఆర్ పాత్రకు అరవింద్ స్వామి సెట్ అవుతాడా కాదా అని చాలా మంది టెన్షన్ పడ్డారు. కానీ, చివరకు ఎంజీఆర్ పాత్రకు అరవింద్ స్వామి కరెక్ట్ గా సెట్ అయ్యాడని యూనిట్ చెప్తోంది. అటు కంగనా మేకప్ కోసం హాలీవుడ్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ లు వచ్చి మేకప్ వేస్తున్నారు. ఈ సినిమా కోసం కంగనా తమిళ్ నేర్చుకోవడం విశేషం.