కంగన, తాప్సీ పరస్పరం ప్రశంసల జల్లు


బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్లు కంగన రనౌత్‌, తాప్సీ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు కొంతకాలంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ వీరిద్దరు ఒకరిపై ఒకరు పొగడ్తల జల్లు కురిపించుకున్నారు. ‘తప్పడ్‌’ సినిమాలో తన నటనకు గానూ తాప్సీ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది. అవార్డు అందుకున్న సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ తనతో పాటు నామినేట్‌ అయిన కంగన, దీపిక పదుకొణె, జాన్వీ కపూర్‌, విద్యాబాలన్‌ను ఆమె ప్రశంసించింది. అద్భుతమైన నటనతో తనకు ఒక బెంచ్‌మార్కును సెట్‌ చేసినందుకు కంగనకు కృతజ్ఞతలు అంటూ పొగిడేసింది తాప్సీ. దీనికి సంబంధించిన వీడియోను తాప్సీ సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. తాప్సీ వీడియోపై కంగన కూడా స్పందిస్తూ తాప్సీకి ధన్యవాదాలు చెప్పడంతో పాటు ఈ అవార్డు అందుకోవడానికి నీకంటే అర్హులు మరెవరూ లేరంటూ తాప్సీపై ప్రశంసలు కురిపించింది.

CLICK HERE!! For the aha Latest Updates