HomeTelugu Trendingరాజశేఖర్‌ కుమార్తె 'దొరసాని' ఫస్ట్‌లుక్‌

రాజశేఖర్‌ కుమార్తె ‘దొరసాని’ ఫస్ట్‌లుక్‌

5 23ప్రముఖ నటుడు రాజశేఖర్‌ చిన్న కుమార్తె శివాత్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దొరసాని’. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. లుక్‌లో శివాత్మిక కారులో ప్రయాణిస్తుండగా.. సైకిల్‌పై ఆనంద్‌ ఆమెను ఫాలో అవుతూ కనిపించారు. లుక్‌ను చూస్తే సినిమాను 1980ల కాలం నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రముఖ షార్ట్‌ ఫలింమేకర్‌ కేవీఆర్‌ మహేంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

జూన్‌7న టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు లుక్‌లో ప్రకటించారు. మహేంద్ర ఇండస్ట్రీలో 17 ఏళ్లుగా ఉన్నప్పటికీ ‘దొరసారి’ స్క్రిప్ట్‌ను తయారుచేయడానికి తనకు ఐదేళ్ల సమయం పట్టిందట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పాతకాలంనాటి టీనేజ్‌ రొమాన్స్‌ను, ఆ కాలంలో ఇద్దరు ప్రేమికులు సమాజంలో ఎదుర్కొన్న ఇబ్బందులను సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపారు. యశ్‌ రంగినేని, మధురా శ్రీధర్‌ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu