‘దృవ’ ప్రీరిలీజ్ ఫంక్షన్ అక్కడేనా..?

రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దృవ’. రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని డిసంబర్ నెలలో విడుదల చేయనున్నారు. అయితే
సినిమా ప్రమోషన్స్ ను కొత్తగా ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ఇందులో భాగంగా ముందుగా
సినిమాలో రెండు పాటల టీజర్స్ ను రిలీజ్ చేశారు. ఈ రెండు టీజర్స్ మెగాఫ్యాన్స్ ను
ఆకట్టుకుంటున్నాయి. అలానే ఈ సినిమా ఆడియోను ఈ నెల 9న నేరుగా మార్కెట్ లోకి
విడుదల చేసి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆ ఫంక్షన్ ను ఎక్కడ జరపాలనేది చిత్రబృందానికి ప్రశ్నార్ధకంగా మారింది. కొందరి
సలహాల మేరకు వరంగల్ లో ప్రీరిలీజ్ ఫంక్షన్ ను జరపడానికి సిద్ధపడుతున్నారని
సమాచారం. ఈ విషయంలో అధికార ప్రకటన రావాల్సివుంది. చరణ్ ఈ సినిమా విషయంలో
ఎంతో నమ్మకంతో ఉన్నాడు. మరి తన అంచనాలకు ఈ సినిమా రీచ్ అవుతుందో.. లేదో..
చూడాలి!