Pushpa 2 remunerations:
Pushpa 2 సినిమా విడుదలకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. తాజాగా ఈ సమయంలో సినిమాకి సంబంధించి ఖర్చులు, నటీనటుల రెమ్యూనరేషన్, నిర్మాతల లాభాలు వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పుష్ప 2 నిర్మాణ వ్యయాలు, వడ్డీతో కలిపి రూ. 475 కోట్లుగా అంచనా. ఇందులో హీరో రెమ్యూనరేషన్ కలపలేదు. దర్శకుడు సుకుమార్ గత మూడు సంవత్సరాల్లో రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ పొందారు. ప్రారంభంలో, అల్లు అర్జున్ సినిమా మొత్తం బిజినెస్‌లో 27% షేర్ తీసుకోవాల్సి ఉంది. అయితే చివరికి 24%కు అంగీకరించారు. అది మొత్తం 240 కోట్లు అయింది.
#AlluArjun’s Shocking Remuneration for #Pushpa2:
👉#AlluArjun is receiving a share of the movie’s Profits. Specifically, he is receiving 27% of the total turnover of the film.
👉As #Pushpa2 has reportedly grossed more than 1000Crs, this means #AA share would be 270 Crs.
👉The… pic.twitter.com/Lm67fHG4de
— PaniPuri (@THEPANIPURI) October 27, 2024
రూ. 475 కోట్ల నిర్మాణ వ్యయానికి రూ. 240 కోట్ల హీరో రెమ్యూనరేషన్ కలిపి, సినిమా మొత్తం ఖర్చు రూ. 715 కోట్లు బడ్జెట్ లాగా మారింది. పుష్ప 2 థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ కలపగా.. రూ. 1000 కోట్లు వచ్చాయి. దీంతో నిర్మాతలకి రూ. 285 కోట్ల లాభం మిగిలింది.
ఆ మొత్తంలో మళ్ళీ సుకుమార్ రైటింగ్స్‌కు సగం అంటే రూ. 140 కోట్లు, బన్నీ వ్యవహారాలను నిర్వహించేవారికి 10% (సుమారు రూ. 14 కోట్లు) ఇచ్చేస్తే.. నిర్మాతలకు గరిష్టంగా రూ. 125-130 కోట్ల లాభం మిగిలింది. మరోవైపుసినిమా టిక్కెట్ ధరలు భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లాన్ సినిమా బ్రేక్‌ఈవన్‌ను చేరడాన్ని వేగవంతం చేస్తుందా, లేదా అనేది వేచి చూడాలి.
ALSO READ: Madhapur Drug Racket లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్టు!