
Dulquer Salmaan in Nani movie:
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నిర్మాతగా మంచి హై మీద ఉన్నాడు. ఇటీవల తన ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా ద్వారా తీసిన కోర్ట్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ సినిమా దర్శకుడు రామ్ జగదీష్ టాలెంట్‌ను ఇండస్ట్రీ మొత్తం గుర్తించేసింది. ఆ సినిమాతోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన రామ్ జగదీష్ ఇప్పుడు మళ్లీ అదే బ్యానర్‌లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఈసారి టార్గెట్ అయితే స్పెషల్‌గానే ఉంది. మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట రామ్ జగదీష్. కథ పూర్తయిన తర్వాత దుల్కర్‌కు నరేషన్ ఇవ్వనున్నారు. స్క్రిప్ట్ ఆయనకు నచ్చితే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
View this post on Instagram
ఇక దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్కీ బాస్కర్ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న దుల్కర్ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాదు, మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ కోసం కూడా చర్చలు జరుపుతున్నాడు. తెలుగులో గుడ్ మార్కెట్ ఉన్న ఈ స్టార్ హీరో, మంచి కథలు వింటూ ఎంచుకుంటున్నాడు.
నాని, దుల్కర్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అవుతుందేమో అనే అంచనాలు ఉన్నాయి. అయితే… చివరికి ఈ మొత్తం మ్యాటర్ రామ్ జగదీష్ స్క్రిప్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. స్క్రిప్ట్ క్లాస్‌గా ఉంటే దుల్కర్ ఓకే చెయ్యడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
మొత్తానికి… వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో మరో కొత్త ప్రయోగం జరగబోతోంది. నాని బ్యానర్‌కి ఇది మరో ఇంట్రెస్టింగ్ అడిషన్ అయ్యేలా కనిపిస్తోంది!
ALSO READ: ఒక్క ట్వీట్‌తో Akshay Kumar ను లక్షల మంది ఫ్యాన్స్ అన్‌ఫాలో చేశారా?












