మేడ్చల్ లో బన్నీ ఫైట్స్!

హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ఈ సినిమాలో బన్నీ కేటరింగ్ చేసే బ్రాహ్మణుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్, రెండు పాటల మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించడానికి చిత్రబృందం మేడ్చల్ లో సరైన ప్లేస్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఓ భారీ సెట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో డిజైన్ చేసి, మేడ్చల్ లో ఆ సెట్ ను అసెంబుల్ చేయనున్నారు.

అక్కడ క్లైమాక్స్ ఫైట్స్ ను చిత్రీకరిస్తే ఇక సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్లే. మరో రెండు పాటలు బ్యాలన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి ఫారెన్ లో మరొకటి లోకల్ గానే చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే జంటగా కనిపించనుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా జూన్ నెలలోనే విడుదల కావాలి. కానీ కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.