HomeTelugu Trendingవర్మ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' సినిమా ట్రైలర్...

వర్మ ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ సినిమా ట్రైలర్…

5 12
సంచలన దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా నిన్నటి రోజున విడుదలైన సంగతి తెలిసిందే. చాలా కాలం తరువాత వర్మ సినిమాకు మంచి పేరు వచ్చింది. థియేటర్స్ వద్ద జనాలు క్యూలు కడుతున్నారు. సెటైరికల్ సినిమా కావడంతో సినిమాకు మంచి పేరు వచ్చింది. రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ హడావుడి చేసిన వర్మ ఇప్పుడు చైనా వెళ్లారు.

చైనాలో ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. బ్రూస్ లీ సొంత గ్రామం ఫొషాన్ లో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. బ్రూస్ లీ ఎంటర్ ది డ్రాగన్ సినిమా ఎలా ఉంటుందో అందరికి తెలుసు. అయితే, బ్రూస్‌లీని స్ఫూర్తిగా తీసుకొని ఓ యువతి ఎలా ఎదిగింది అనే అంశంతో వర్మ ఈ సినిమాను తెరక్కించాడు. చాలా కాలం తరువాత వర్మ తన బ్రెయిన్ కు పదును పెట్టి సినిమాను తీసినట్టుగా ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతున్నది. ఇందులో హీరోయిన్ గా పూజా బాలేకర్ నటిస్తోంది. హీరో అంటూ ఎవరూ లేదు. పూజానే హీరో, హీరోయిన్. మార్షల్ ఆర్ట్స్ ఫిలిం గా సినిమా తెరక్కింది. ట్రైలర్ ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu