HomeTelugu Trendingపూరి కొడుకు పేరిట నకిలీ ఖాతా.. అమ్మాయిలకు ట్రాప్‌

పూరి కొడుకు పేరిట నకిలీ ఖాతా.. అమ్మాయిలకు ట్రాప్‌

3 25

దర్శకుడు పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్ పూరి పేరిట ఓ నకిలీ ఖాతాను తెరిచాడో యువకుడు. అది తెలియని కొంతమంది అమ్మాయిలు అది నిజమనే నమ్మడంతో వారిని వలలోకి దింపేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో ఓ బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినీ హీరోలు, ప్రముఖులు, సెలబ్రిటీల్లో అధికశాతం ట్విట్టర్‌ను వినియోగిస్తున్నారు. వాళ్ల అకౌంట్లను అనుసరిస్తున్నవాళ్ల సంఖ్య వేలు, లక్షల్లో కూడా ఉంటోంది. అయినా వారి పేరిట నకిలీ ఖాతాలు తెరిచే వారు కూడా రెచ్చిపోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu