‘వినయ విధేయ రామ’ నుంచి ఫ్యామిలీ సాంగ్‌!

రామ్‌ చరణ్‌.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ‘వినయ విధేయ రామ’ సినిమా రాబోతోన్నసంగతి తెలిసిందే. మాస్‌, యాక్షన్‌ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న బోయపాటి.. ఈసారి తన మార్క్‌ను మిస్‌ కాకుండా.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా టచ్‌ చేయబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్, ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చింది.

 

ఇక టీజర్‌లో రామ్‌చరణ్‌ చెప్పిన రామ్‌.. కొ..ణి..దె..ల డైలాగ్‌ ఎంత పాపులర్‌ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫ్యామిలీ సాంగ్‌ను రిలీజ్‌చేయబోతున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించారు. సోమవారం (డిసెంబర్‌ 3) సాయంత్రం 4గంటలకు ఆ పాట (తందానే తందానే)ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది.