విజయ్ దేవరకొండను చూడగానే ఓ యువతి భావోద్వేగానికి గురయ్యారు. తన అభిమాన హీరోని హత్తుకున్న ఆనందంలో బోరున ఏడ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ అమ్మాయిని ఓదార్చుతూ విజయ్ ప్రవర్తించిన తీరు అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. యువతిని దగ్గరకు తీసుకుని విజయ్ హత్తుకున్నారు. ఇది ‘డియర్ కామ్రేడ్’ మ్యూజికల్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు విజయ్ విమానాశ్రయానికి వెళ్లినప్పుడు తీసిన వీడియోగా తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లోనూ విజయ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రమోషన్ కోసం చెన్నై, బెంగళూరు, కొచ్చి వెళ్లినప్పుడు ఈ విషయం స్పష్టంగా అర్థమైంది.
‘డియర్ క్రామేడ్’ సినిమా ఇటీవల విడుదలై, మంచి టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకుడు క్రాంతి మాధవన్ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. ఇంకా ఈ చిత్రం టైటిల్ ఖరారు కాలేదు. దీని తర్వాత ఆయన ‘హీరో’ సినిమా షూటింగ్ కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Emotional moment of @TheDeverakonda fan!#VijayDeverakonda #VijayDevarakonda #BiggBossTamil #BiggBossTamil3 #DearComradereview pic.twitter.com/tujvddJdms
— The Cine Bytes (@TheCineBytes) July 27, 2019













