నక్షత్రాన్ని గిఫ్ట్ గా ఇచ్చిన అభిమాని!

‘ముకుంద’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన ముద్దుగుమ్మ పూజాహెగ్డే. ఆ తరువాత ‘ఒక లైలా కోసం’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ కు వెళ్ళి హృతిక్ రోషన్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఆమె అనుకున్న స్థాయిలో సినిమా సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టింది. ఇటీవల అల్లు అర్జున్ సరసన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటించి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాలో అమ్మడు తన అందాలతో యూత్ ను ఆకట్టుకుంది. దీంతో వరుస అవకాశాలు పూజాను వెతుక్కుంటూ వస్తున్నాయి.
తన కెరీర్ గాడిలో పడుతున్న సమయంలో ఓ అభిమాని నుండి ఆమెకు వచ్చిన గిఫ్ట్ ను చూసి షాక్ కు గురైందట. మరి ఆమె అంతగా అవాక్కయ్యేలా.. ఆ అభిమాని ఏం ఇచ్చాడో.. తెలుసా..? ఒక నక్షత్రాన్ని. లండన్ లో ఉన్న పూజా అభిమాని భూప్రపంచంలో మరే బహుమతి తారసపడనట్లు ఆకాశంపై దృష్టి పెట్టాడు. ఆన్ లైన్ పోర్టల్ లో పూజా హెగ్డేకు ఒక నక్షత్రాన్ని రాసి ఇచ్చేశాడు. దీంతో పూజా షాక్ అయిందని తెలుస్తోంది. అయితే సేమ్ టు సేమ్ ఇదే సీన్ పూజా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాలో కూడా ఉంది. హీరో అతడి ప్రేమను తెలియజేయడానికి పూజాకు నక్షత్రాన్ని రాసి ఇస్తాడు. సరిగ్గా అదే 
బహుమతిని తన అభిమాని నుండి నిజంగానే దక్కించుకుంది ఈ బ్యూటీ.