‘మెర్సల్’ వివాదం.. అభిమానుల హెచ్చరిక!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన నూతన చిత్రం ‘మెర్సల్’. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లు కొల్లగొట్టడం విశేషం. అయితే ఇప్పుడు ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. దానికి కారణంలో సినిమాలో హీరో విజయ్ బిజెపీ పార్టీ అలానే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ మీద సెటైర్లు వేశారు. ఈ విజయం సదరు పార్టీ నేతలకు ఆగ్రహాన్ని తెప్పించింది. వాళ్ళు విజయ్ అలానే చిత్ర దర్శకనిర్మాతల
మీద విరుచుకు పడ్డారు. కేవలం రాజకీయనాయకుల మీద మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ హాస్పిటళ్ల మీద, వైద్యుల మీద కూడా సెటైర్లు వేశారు.

వాళ్ళకు కేవలం డబ్బు మాత్రమే ముఖ్యమని మనుషుల ప్రాణలంటే ఏ మాత్రం లెక్క లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు డాక్టర్లు కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో సినిమా నుండి ఆ సన్నివేశాలను
తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాత కూడా సన్నివేశాలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నిర్మాత ఆ విధంగా చెప్పడం విజయ్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది.

ఇప్పటికే బీజేపీకు అలానే సినిమాపై విరుచుకుపడుతున్న వైద్యులకు వ్యతిరేకంగా విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడేమో సన్నివేశాలు తొలగిస్తామని నిర్మాతలు చెప్పడంతో అభిమానులు ఊరుకునేలా లేరు. ”ఇలాంటి సందేశాత్మక చిత్రాలను తీయడం ఎందుకు..? తీసిన సినిమాలకు కట్టుబడి ఉండకపోవడం ఏంటని..? ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అభిమానులు సినిమాలో నుండి సన్నివేశాలను తీసి చూడండి ఆ తరువాత ఏం జరుగుతుందో చూడండి” అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పటికి సద్ధుమణుగుతుందో.. చూడాలి!