HomeTelugu Trendingదర్శకురాలిగా మారిన దంగల్‌ బ్యూటీ

దర్శకురాలిగా మారిన దంగల్‌ బ్యూటీ

Fatima Sana Shaikh makes di‘దంగల్’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. ఆ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించింది ఈ బ్యూటీ. రెజ్లర్ గీతాసింగ్ పొగాత్ పాత్రలో మెప్పించింది. ఆ సినిమాలో కారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈ అమ్మడు.. తాను హీరోయిన్ మెటీరియల్ అని తర్వాత హాట్ ఫోటోషూట్‌లతో నిరూపించింది. అందాలతో కుర్రకారు మతిపోగోట్టే సనా ఇప్పుడు మెగాఫోన్ పట్టుకుంది. అయితే ఈ భామ దర్శకురాలిగా మారింది సినిమా కోసం కాదు. ఒక పాటకోసం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన చుట్టు ఉన్న వారు ఎలా ఉన్నారు వారు ఏం చేస్తున్నారు అనే విషయాలతో ఒకవీడియో సాంగ్ ను తెరకెక్కించింది. విశాల్ భరద్వాజ్ ఈ పాటలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయిస్తోంది ఫాతిమా సనా షేక్. ఈ పాట ప్రజలను ఆలోచింపజేస్తుందని ఆమె తెలిపింది.

పాట గురించి ఫాతిమా మాట్లాడుతూ.. విశాల్ నాకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు. నేను ఎలా కోరుకున్నానో అలా నటించారు. ఈ పాటలో నా కుక్క బిజిలీ కూడా కనిపించబోతుంది. విశాల్ సర్ తో దానికి నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. అతి త్వరలోనే ఆ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu