అల్లు అరవింద్‌ రామయణంలో సీత ఆ హీరోయినే!

ప్రముఖ దర్శకుడు అల్లు అరవింద్, ప్రైమ్ మూవీస్ అధినేతలు మధు మంతెన, మల్హోత్రాలు కలిసి రామాయణాన్ని సినిమాగా తీయబోతున్నారు. దీనికోసం ఏకంగా రూ. 1500 కోట్లు ఖర్చు చేస్తున్నారట. మూడు భాగాలుగా 3డిలో తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో సీత పాత్రను చేసే అవకాశం నయనతారకు దక్కిందని తెలుస్తోంది. బాపు శ్రీరామా రాజ్యం సినిమాలో నయనతార సీత పాత్ర చేసి మెప్పించింది. దీంతో రెండోసారి ఆమెకు సీత పాత్ర చేసే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఇండియాలో బిజీ గా ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. భారీ సినిమా కాబట్టి డేట్స్ కూడా భారీగా ఇవ్వాలి. మరి బల్క్ లో డేట్స్ ఇచ్చేందుకు నయనతార ఒకే అంటుందా చూద్దాం.