‘ఫియర్‌’ టీజర్

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, కలైరసన్ ప్రధాన పాత్రలతో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫియర్’. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో మైమ్ గోపి, జయబాలన్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ ఆనంద్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని.. ఇప్పుడు తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ అంటూ సరికొత్తగా ప్రారంభించబడిన స్పార్క్ ఓటీటీలో ‘ఫియర్’ సినిమాని స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా భయంగా ఉన్న ఈ గ్రిప్పింగ్ టీజర్ ఆకట్టుకుంటోంది. జోహన్ షెవనేష్ అందించిన నేపథ్య సంగీతం భయాన్ని కలిగిస్తోంది. శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఫియర్’ ట్రైలర్ ను రేపు (జూన్ 11) విడుదల చేయనున్నారు. స్పార్క్ ఓటీటీలో జూన్ 12వ తేదీ నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates