HomeTelugu Big Storiesకెప్టెన్‌ మిల్లర్: తుపాకుల మోతతో దద్దరిల్లిన ట్రైలర్

కెప్టెన్‌ మిల్లర్: తుపాకుల మోతతో దద్దరిల్లిన ట్రైలర్

Captain Miller Telugu Trail

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. కోలీవుడ్‌లో జనవరి 12న ప్రపంచవాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. అరుణ్‌ మథేశ్వరన్‌ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌ తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున, వెంకటేశ్‌ లాంఛ్ చేశారు.

ఈ ట్రైలర్‌ తెల్లదొరలంతా దొంగలు అనే డైలాగ్స్‌తో ప్రారంభమైంది. నీలాగా నేను కూడా ఓ హంతకురాలినై ఉంటే.. వాడిని నేనే చంపేవాడిని.. ప్రియాంక మోహన్‌ చెబుతున్న సంభాషణలతో సాగుతున్న ట్రైలర్‌.. తెల్లదొరలకు వ్యతిరేకంగా కెప్టెన్ మిల్లర్‌ అండ్‌ టీం ఎలా పోరాడిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేలా ఉన్న ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ఈ సినిమాని తెలుగులో సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఏసియన్ సినిమాస్‌ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాయి. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్‌ స్పూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్‌. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌ , టాలీవుడ్ నటుడు సందీప్‌ కిషన్‌, నివేదితా సతీశ్‌, అమెరికన్‌ యాక్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్‌ తెరకెక్కించిన కెప్టెన్‌ మిల్లర్ ఇప్పటికే తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక, ఓవర్సీస్‌లో తన సత్తా చాటుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా తెలుగులో ఈ సినిమా జనవరి 12 విడుదల కావాల్సి ఉంది. అయితే అప్పటికే సంక్రాంతి బరిలో పలు పెద్ద సినిమాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా అడుగు వేయాల్సి వచ్చింది.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!