ఆరడుగుల బుల్లెట్ కు అప్పుల బాధ!

ఏ సినిమా అయినా.. విడుదలకు ముందుకు చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. ఫైనాన్షియర్ల దగ్గర నుండి క్లియరెన్సులు తీసుకొని, విడుదలకు రెడీ చేయడానికి నిర్మాతలు పడే బాధలు మామూలుగా ఉండవు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే గోపిచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’కు ఎదురయ్యాయి. ఎప్పుడో మూడేళ్ళ కిందట మొదలైన ఈ సినిమా బడ్జెట్ దాటిపోవడం, నిర్మాతలు చేతులు ఎత్తేయడంతో ఆగిపోయింది. కానీ తాజాగా పీవీపీ సంస్థ ఆర్థిక సహాయం అందించడంతో సినిమాను పూర్తి చేసి విడుదల చేయడానికి రెడీ చేశారు. అయితే ఈ సినిమాకు అప్పు ఇచ్చిన ఫైనాన్షియర్లు తమకు రావాల్సిన మొత్తాన్ని సెటిల్ చేయమని నిర్మాతపై ఒత్తిడి తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పీవీపీ సంస్థ ఈ సినిమా కోసం 16 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. మాకు కూడా సెటిల్ చేయమని ఫైనాన్షియర్లు పీవీపీను అడుగుతున్నట్లు సమాచారం. సినిమా విడుదలైన తరువాత ఏదొకటి చేద్దామని సర్ద్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నా.. అప్పుల వాళ్ళు మాత్రం వినిపించుకోవడం లేదట. కనీసం ఇప్పుడు సగమైన సర్ధుబాటు చేయమని ఒత్తిడి రావడంతో ఆ బాధ్యతను కూడా పీవీపీ తన భుజాలపై వీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన తరువాత పాతిక కోట్లు కలెక్షన్స్ వసూలు అయితే తప్ప ఈ అప్పుల బాధ కాస్త అయినా.. తగ్గదు.