సూపర్ స్టార్ బయోపిక్ లో కట్టప్ప..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో కూడా గొప్ప వ్యక్తుల జీవితాలు ఆధారంగా సినిమాలను చిత్రీకరిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ బయోపిక్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ బయోపిక్ లో తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమాను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లక్షలాది మంది అభిమానులను సాధించిన ఈ లెజండరీ నటుడి బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బాలకృష్ణన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రమణ కమ్యూనికేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఎంజీఆర్ పాత్రకు సత్యరాజ్ పూర్తి న్యాయం చేస్తాడని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.