HomeTelugu Trending'ఎఫ్‌ ఐ ఆర్‌' ట్రైలర్‌

‘ఎఫ్‌ ఐ ఆర్‌’ ట్రైలర్‌

fir

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మంజిమ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ ఐ ఆర్’. మను ఆనంద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ విష్ణు విశాల్ బ్యానర్ పై హీరో విష్ణు విశాల్ తెలుగులో అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.

‘ ఐఎస్ ఐ టెర్రిరిజమ్ నేపథ్యంలో సాగే కథగా ట్రైలర్ ని ఓపెన్ చేశారు. టెర్రరిజం పెరగాలి అని బాంబ్ బ్లాస్ట్ లు చేసే ఒక వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. అయితే ఆ కరుడు గట్టిన టెర్రరిస్ట్.. హీరోనే అనుకోని అతడిని ఫాలో అయ్యి ఒకనాకొక దశలో అరెస్ట్ చేస్తారు. అప్పటివరకు ఎంతో హ్యాపీగా ఉన్న అతడి జీవితం తలకిందులవుతుంది. అమాయకుడిగా ఉన్న అతడిపై దేశ ద్రోహి ముద్ర పడుతుంది. ఇక తనను అంతగా వేధించిన ఈ పోలీస్ వ్యవస్థపై ఆ అమాయకుడు రివెంజ్ తీర్చుకోవడానికి నిజంగానే టెర్రరిస్ట్ గా మారి పోలీసులను ముప్పుతిప్పలు పెడతాడు.

అస్సలు పోలీసులు వెతుకుతున్న కరుడు గట్టిన టెర్రరిస్ట్ ఎవరు..? అతనికి, హీరోకు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు హీరో నిర్దోషి అని నిరూపించుకున్నాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక అమాయకుడిగా, టెర్రరిస్ట్ గా విష్ణు విశాల్ నట అద్భుతమని చెప్పాలి. పోలీస్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమ మోహన్ లాయర్ గా కనిపించి మెప్పించారు. ఇక మరో హీరోయిన్ రెబా మోనికా జాన్ కూడా బాగా నటించింది. టెర్రరిజమ్ కారణంగా ఓ అమాయకుడు ఎదుర్కొన్న పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు. తెలుగు తమిళ భాషల్లో ఫిబ్రవరి 11న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!