HomeTelugu Trendingఏప్రిల్‌ 28న 'పెళ్లిసందD' నుంచి ఫస్ట్‌ సాంగ్‌

ఏప్రిల్‌ 28న ‘పెళ్లిసందD’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌

First lyrical song announce
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో 1996లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘పెళ్లిసందడి’. శ్రీకాంత్‌ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్‌ హిట్‌ అయింది. ఆ సినిమా పేరుని మరోసారి తలపిస్తూ తాజాగా ‘పెళ్లిసంద…D’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని పాటని ఏప్రిల్‌ 28న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా లిరికల్‌ వీడియో ప్రకటనకు సంబంధించిన చిన్న వీడియోను షేర్‌ చేశారు. ‘‘ఇది కొత్త కథతో తెరకెక్కుతున్న చిత్రం. నాటి ‘పెళ్లి సందడి’కి కొనసాగింపు చిత్రం కాదు. రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ నెల 28న విడుదల కానున్న పాటతో కె.రాఘవేంద్రరావు – కీరవాణి స్వరాల సందడి మళ్లీ మొదలవుతుంద’’ని సినీ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu