
Alia Bhatt Instagram Earnings:
ఈ రోజుల్లో సెలెబ్రిటీలు సినిమాలు, అడ్స్ కాకుండా సోషల్ మీడియా వేదికలపైనా బాగా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు ఎక్కువగా ఉన్న సెలెబ్రిటీలు ఒక్కో పోస్టుకు లక్షల్లో నుంచి కోట్లలో వరకు తీసుకుంటున్నారు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం 271 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో భారత్‌లో అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన వ్యక్తి. ఒక్క బ్రాండ్ పోస్టుకు సుమారు రూ.14 కోట్లు తీసుకుంటాడు. ఇది ఏ భారతీయ సెలెబ్రిటీ అయినా పొందే అత్యధిక రేటు.
ప్రియాంక చోప్రా 92 మిలియన్లకుపైగా ఫాలోవర్లతో టిఫానీ & కో, రాల్ఫ్ లారెన్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్స్‌కి ప్రచారం చేస్తుంది. ఒక్క పోస్టుకు సుమారుగా రూ.3 కోట్లు తీసుకుంటుంది.
దీపికా పదుకొణే లీవిస్, అడిడాస్ లాంటి బ్రాండ్లకు ప్రచారం చేస్తూ, ప్రతి పోస్టుకు రూ.2 కోట్లు తీసుకుంటుంది.
శ్రద్ధా కపూర్ 94 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో టాప్ బాలీవుడ్ హీరోయిన్. ఆమె ఏజియో, మైగ్లామ్ వంటి బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తూ, ఒక్కో పోస్టుకు రూ.1.4 కోట్లు సంపాదిస్తుంది.
ఆలియా భట్‌కి 86 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మేబిలిన్, మేక్ మై ట్రిప్ లాంటి బ్రాండ్ల కోసం పోస్ట్ చేస్తూ ఒక్కదానికి రూ.85 లక్షల నుంచి రూ.1 కోట్ల వరకు సంపాదిస్తుంది.
కత్రినా కైఫ్‌కి 80 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఆమె లెన్స్‌కార్ట్, రీబాక్ లాంటి బ్రాండ్ల కోసం పనిచేస్తూ, ఒక్క పోస్టుకు రూ.97 లక్షలు అందుకుంటుంది.
సోషల్ మీడియా ఒక్క ఫోటో షేర్ చేసే ప్లాట్‌ఫారమ్‌గా కాకుండా, ఇప్పుడు సెటిలైన కమర్షియల్ సోర్స్‌గా మారిపోయింది. ఫాలోవర్లు ఎక్కువైతే, బ్రాండ్స్ వస్తాయి… బ్రాండ్స్ వస్తే కోట్లు వచ్చేస్తాయి!













