
AP Budget 2025-26:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఫిబ్రవరి 28, 2025న ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పైయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కొత్త ప్రభుత్వానికి ఇది పూర్తి స్థాయిలో సమర్పించిన తొలి బడ్జెట్ కావడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. మొత్తం ₹3.22 లక్షల కోట్ల బడ్జెట్‌లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక పునరుద్ధరణకు పెద్దపీట వేసారు.
బడ్జెట్ ఓవర్వ్యూ:
*మొత్తం బడ్జెట్ – ₹3,22,359 కోట్లు
*రెవెన్యూ ఖర్చులు – ₹2,51,162 కోట్లు
*రెవెన్యూ లోటు – ₹33,185 కోట్లు
*భౌతిక పెట్టుబడి (కాపిటల్ ఎక్స్పెండిచర్) – ₹40,635 కోట్లు
*ఆర్థిక లోటు (ఫిస్కల్ డెఫిసిట్) – ₹79,926 కోట్లు
సంక్షేమ పథకాలు – ఎవరికెంత?
*తల్లికి వందనం – ₹9,407 కోట్లు (అమ్మలకు ఆర్థిక సహాయం)
*అన్నదాత సుఖీభవ – ₹6,300 కోట్లు (రైతుల కోసం)
*జల్ జీవన్ మిషన్ – ₹2,800 కోట్లు (శుద్ధ మంచినీటి సరఫరా)
*నవోదయ 2.0 – ₹10 కోట్లు (మద్య, మాదకద్రవ్య విముక్త రాష్ట్రం)
సామాజిక సంక్షేమం:
*ఎస్సీ సంక్షేమం – ₹20,281 కోట్లు
*ఎస్టీ సంక్షేమం – ₹8,159 కోట్లు
*బీసీ సంక్షేమం – ₹47,456 కోట్లు
*అల్పసంఖ్యాక సంక్షేమం – ₹5,434 కోట్లు
*మహిళలు, పిల్లలు, వృద్ధుల సంక్షేమం – ₹4,332 కోట్లు
విద్యా రంగం & నైపుణ్య అభివృద్ధి:
*పాఠశాల విద్య – ₹31,805 కోట్లు
*ఉన్నత విద్య – ₹2,506 కోట్లు
*నైపుణ్యాభివృద్ధి శిక్షణ – ₹1,228 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖ:
*మెడికల్ & హెల్త్ – ₹19,264 కోట్లు
మౌలిక సదుపాయాలు & అభివృద్ధి:
*పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి – ₹18,847 కోట్లు
*పట్టణాభివృద్ధి – ₹13,862 కోట్లు
*ఇళ్ళ నిర్మాణం – ₹6,318 కోట్లు
*నీటిపారుదల (వాటర్ రిసోర్సెస్) – ₹18,019 కోట్లు
*పరిశ్రమలు & వాణిజ్యం – ₹3,156 కోట్లు
*ఎనర్జీ సెక్టార్ – ₹13,600 కోట్లు
*ఆర్&డి (సంశోధన & అభివృద్ధి) – ₹8,785 కోట్లు
ఇతర ముఖ్య బడ్జెట్ కేటాయింపులు:
*పోలవరంపై భారీ బడ్జెట్ – ₹6,705 కోట్లు
*తెలుగు భాషా అభివృద్ధి – ₹10 కోట్లు
*హోం డిపార్ట్మెంట్ – ₹8,570 కోట్లు
ఈ బడ్జెట్ ప్రత్యేకతలు?
✅ సంక్షేమం & అభివృద్ధి: మహిళలు, రైతులు, వెనుకబడిన తరగతుల సంక్షేమం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
✅ ఆర్థిక పునరుద్ధరణ: గత ప్రభుత్వ ఆర్థిక పొరపాట్లను సరిచేయాలని లక్ష్యం.
✅ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్: పోలవరం, అమరావతి, పట్టణ-గ్రామీణ అభివృద్ధికి పెద్ద నిధులు.
✅ సామాజిక న్యాయం: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీగా నిధులు కేటాయింపు.
✅ విద్య, నైపుణ్య అభివృద్ధి: యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు.
ALSO READ: నామినీలకి ఇచ్చిన Oscars 2025 gift bag లో ఏముంటాయో తెలుసా?