సినిమాల్లోకి మహేష్ మేనల్లుడు!

సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఇలా అందరి కుటుంబంలోని సభ్యులు హీరోలుగా పరిచయమవుతూనే ఉన్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి మరో హీరో పరిచయం కాబోతున్నాడు. అతడు ఎవరో కాదు మహేష్ బాబు సొంత మేనల్లుడు గల్లా అశోక్.

టీడీపీ ఎంపీ, పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ పెద్ద కుమారుడే ఈ గల్లా అశోక్. స్మార్ట్ లుక్స్ తో హీరోకు కావల్సిన అన్ని లక్షణాలు ఉన్న అశోక్ ను త్వరలోనే హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అశోక్ యాక్టింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

ఇండస్ట్రీలో పెద్ద టెక్నీషియన్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మించాలని గల్లా జయదేవ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి మావయ్యలానే అశోక్ కూడా స్టార్ హీరోగా వెలుగొందుతాడేమో చూడాలి!