
Game Changer Loss:
గేమ్ ఛేంజర్ సినిమా, రామ్ చరణ్ నటనతో భారీ అంచనాల మధ్య జనవరి 10న విడుదలైంది. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కాగా, మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుని డిజాస్టర్ గా మారింది. మెగా అభిమానులు కూడా సినిమాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యంగా శంకర్ దర్శకత్వంపై రాంచరణ్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. సినిమాలో నానా హైరానా సాంగ్ కూడా ఉండకపోవడం కూడా విమర్శలకు లోనైంది. ఇక రెండో రోజు నుంచి ఈ చిత్రానికి కలెక్షన్స్ తగ్గిపోవడం గమనర్హం. దానికి తోడు మరోపక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సునామి సృష్టించడంతో.. ఈ చిత్రం కలెక్షన్స్ పూర్తిగా తగ్గిపోయాయి.
ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ సినిమా, 18 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 130.01 కోట్లను వసూలు చేసినట్లు సమాచారం. ఇక, 18వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు కేవలం రూ. 41 లక్షలపైనే ఉన్నాయ్.
ఈ భారీ బడ్జెట్ సినిమా రూ. 450 కోట్లతో నిర్మించబడింది. అయితే, ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. మరి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చేలా ఉంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరడిజాస్టర్ గా మిగల నుండి అని అందరికీ క్లారిటీ వచ్చేసింది.