Game Changer Release Date: మెగా హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తో.. త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో.. రామ్ చరణ్ పాత్రకు సంబంధించి కేవలం ఒక్క రోజు షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా పూర్తి అయిపోతే.. ఇక రామ్ చరణ్ ఫ్రీ అయిపోయినట్టే. అంతేకాకుండా సముతిరఖని కాంబినేషన్ లో కూడా ఒక రోజు షూట్ మిగిలి ఉంది.
ఇక మిగిలిన పాత్రల షూటింగ్ ఇంకా 10 రోజుల వరకు ఉంటుందట. షూటింగ్ పూర్తి అయిపోతే.. కేవలం నిర్మాణాంతర పనులు మాత్రమే మిగిలి ఉంటాయి. వాటికి కొంత సమయం కేటాయించాలి అంటే.. సినిమా దీపావళికి రావడం కష్టం అయిపోతుంది. టైట్ షెడ్యూల్ లో సినిమా విడుదల చేయడం కంటే.. డిసెంబర్ లో క్రిస్మస్ కు సినిమా విడుదల చేయాలని డిస్కషన్ లు జరుగుతున్నాయట.
అయితే ఆగస్టు నుండి వాయిదా పడిన పుష్ప 2 డిసెంబర్ 6 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 డిసెంబర్ కి మారడంతో.. నితిన్ రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల విడుదల ను క్రిస్మస్ నుండి మానుకున్నాడు. నాగ చైతన్య కూడా తండేల్ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
కానీ ఇలాంటి సమయంలో రామ్ చరణ్ అల్లు అర్జున్ సినిమాకి వ్యతిరేకంగా.. తన సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేయడం.. ఇప్పుడు అభిమానులలో కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఎన్నికల సమయం నుంచి.. అల్లు అభిమానులు మెగా అభిమానులు మధ్య.. సోషల్ మీడియాలో యుద్ధమే జరుగుతుంది.
ఈ సమయంలో తన సినిమా విడుదల చేసినా హిట్ అవ్వదేమో అని.. అల్లు అర్జున్ కావాలని పుష్ప 2 ని వాయిదా వేశారని.. కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో రామ్ చరణ్ కూడా మెగా కుటుంబ సభ్యుడు అయ్యుండి.. అల్లు అర్జున్ సినిమాకి పోటీగా తన సినిమాని విడుదల చేయడం.. కచ్చితంగా వివాదాస్పదంగానే మారబోతోంది.
నిజంగానే రామ్ చరణ్ సినిమా డిసెంబర్ లో పుష్ప 2 కి పోటీగా విడుదల అయితే మాత్రం.. అల్లు, మెగా అభిమానుల మధ్య పెద్ద వార్ జరగవచ్చు. మరి అప్పుడు ఇద్దరు హీరోలలో ఎవరి సినిమా గెలుస్తుందో వేచి చూడాలి.
More About Game Changer:
కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.