HomeTelugu Trending'మంగళవారం' గణగణ వీడియో సాంగ్‌ విడుదల

‘మంగళవారం’ గణగణ వీడియో సాంగ్‌ విడుదల

Ganagana Mogalira Lyrical V
‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా దర్శకుడిగా అజయ్ భూపతికి, హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో పాయల్‌ ఎంత బోల్డ్‌గా నటించిదో తెలిసిందే. ఆ టైమ్‌ ఈ అమ్మడికి మంచి యూత్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఆ తరువాత పలు సినిమాలు చేసినప్పటికి అవి పెద్దగా సక్సెస్‌ కాలేదు అని చెప్పాలి. ఈ నేపధ్యంలో మరో సారి అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో పాయల్‌ నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. ఫీ మేల్ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌తో హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.

ఇప్పటికే విడుదల చేసిన మంగళవారం టైటిల్‌, కాన్సెప్ట్‌ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ సినిమా నుంచి తాజాగా గణగణ మోగాలిరా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏ క్రియేటివ్‌ వర్క్స్‌, ముద్ర మీడియా వర్క్స్‌ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీలో నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అజయ్‌ భూపతి రెండో సినిమా మహాసముద్రం భారీ అంచనాల మధ్య విడుదలై.. ఫ్లాప్‌ గా మిగిలిపోయింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!