‘గ్యాంగ్‌ లీడర్‌’ ఫస్ట్‌లుక్‌

సహజ నటుడు నాని హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ చిత్రంలో నానితోపాటు నలుగురు మహిళలు, ఓ పాప కనిపించారు. వారంతా మేడపై నిల్చుని బైనాక్యులర్‌ పట్టుకుని దేన్నో చూస్తున్నారు. ‘బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..’ అని నాని వారి పాత్రలను ట్విటర్‌ ద్వారా పరిచయం చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది.

‘హలో’ తర్వాత విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి పాటను జులై 18న, టీజర్‌ను జులై 24న విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరోపక్క నాని ‘వి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు మరో హీరోగా కనిపించనున్నారు. నివేధా థామస్‌, అదితిరావు హైదరి హీరోయిన్‌లు. దిల్‌రాజు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates