HomeTelugu News'గంగూబాయ్‌ కతియావాడి' తెలుగు ట్రైలర్‌..

‘గంగూబాయ్‌ కతియావాడి’ తెలుగు ట్రైలర్‌..

Gangubai Kathiawadi telugu
ముంబైలోని ‘కామాటిపుర’ నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు ‘గంగూబాయి కతియవాడి’ సినిమా రూపొందింది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని జయంతిలాల్ గడ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో అలియా భట్ పోషించింది.

‘గంగూబాయి’ టైటిల్ జనంలోకి ఒక రేంజ్ లో వెళ్లిపోయింది. అలియా డిఫరెంట్ లుక్ కూడా అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీని ఖరారు చేసుకుంది. హిందీతో పాటు తెలుగులోను ఈ సినిమా విడుదల అవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గంగూబాయిగా అలియా బాడీలాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉన్నాయి. తమ జీవితాలను .. పిల్లల భవిష్యత్తును మార్చడానికి ఆమె చేసే పోరాటమే ఈ కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ .. హుమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu