సుస్మితా సేన్ అభిమానులకు శుభవార్త


2010లో అనీస్‌ బాజ్‌మీ దర్శకత్వంలో వచ్చిన ‘నో ప్రాబ్లమ్‌’ చిత్రంలో నటించిన మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ ఆ తర్వాత ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించ లేదు. తన వ్యక్తిగత కారణాల వల్లే సినిమాలకు విరామం ఇచ్చానంటూ ఆమె చెప్పేది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ తన అభిమానులను అలరించడానికి వస్తున్నట్లు ఆమె ప్రకటించారు. సుస్మితా సేన్‌ అభిమానులకు ఇది శుభవార్త. నటనకు దూరమైనప్పటికీ ఏదో విధంగా సోషల్‌ మీడియాలో అభిమానులకు చేరువగా ఉంటూ వస్తున్నారు సుస్మితా.

ఇటీవల తన కుటుంబ సభ్యులతో జరుపుకున్న 44వ పుట్టిన రోజు వేడుకల ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తాను మళ్లీ సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యానంటూ సోషల్ మీడియా వేదికగా సుస్మితా ప్రకటించారు. బాల్కనీలో ఒంటరిగా నిలుచుని ఉన్న ఆమె ఫోటోకి ‘నేను ఎప్పుడూ సహన ప్రేమకు విధేయురాలిని’!! ‘ఈ ఒంటరితనం నా అభిమానులకు అభిమానిగా మార్చింది’, ‘పదేళ్ల నుంచి నన్ను నటన వైపు నడిపించడానికి వారి అభిమానంతో ప్రోత్సాహకం అందిస్తూ వచ్చిన ఫ్యాన్స్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటూ సుస్మితా తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక ఈ వార్త విన్న మాజీ విశ్వసుందరి అభిమానులంతా ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు.

వ్యక్తిగత కారణాల వల్లే తాను నటనకు దూరంగా ఉన్నానని తన రెండవ దత్త పుత్రిక అలిసా కోసమే దూరం కావాల్సి వచ్చిందని సుస్మితా సేన్ ఓ ఇంటర్యూలో చెప్పారు. ఎందుకంటే అలిసా బాల్యానికి తాను దూరంగా ఉండాలనుకోలేదని, తన మొదటి దత్త కూతురు రేనీ సమయంలో తన బాల్య స్మృతులను కోల్పోయానని అన్నారు. అలిసా విషయంలో ఆ తప్పు చేయాలనుకోలేదని ఇందుకోసమే నటనకు దూరంగా ఉన్నట్లు అమె చెప్పారు.

CLICK HERE!! For the aha Latest Updates