‘ఆర్ఆర్ఆర్’ నుండి ఎన్టీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌ రెడీ.!


టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20. ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే, రామ్ చరణ్ పుట్టినరోజైన మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్, ఇంట్రో టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు.

అయితే, మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఎన్టీఆర్‌కు సంబంధించిన ఇంట్రో టీజర్ ను విడుదల చేస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని, ఇప్పటికే ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో సిద్ధం అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇంట్రో టీజర్ నిమిషానికి పైగా ఉండబోతున్నట్టు సమాచారం. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే మరి.