HomeTelugu Trendingమరోసారి మహేష్‌కు విలన్‌గా హీరో గోపీచంద్‌!

మరోసారి మహేష్‌కు విలన్‌గా హీరో గోపీచంద్‌!

Gopichand as a villain in m

టాలీవుడ్ లో మొదటిగా విలన్ పాత్రల్లో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగా మారిపోయాడు గోపీచంద్. గోపీచంద్ తన కెరియర్ తొలినాళ్లలో విలన్ పాత్రలతో మెప్పించాడు. ఆ తరువాత యాక్షన్ హీరోగా తన సత్తా చాటుకుని, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. అలాంటి గోపీచంద్ మళ్లీ పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడని అంటున్నారు .. అదీ రాజమౌళి సినిమాలో. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం గోపీచంద్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేశ్ ‘నిజం’ సినిమాలో గోపీచంద్ విలన్ గా చేశాడు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ కలవనుందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!