
గోపీచంద్ హీరోగా తాజాగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘రామబాణం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతీ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. లక్ష్యం, లౌక్యం వంటి హిట్ సినిమాల తరువాత గోపీచంద్ శ్రీవాస్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న హాట్రిక్ ఫిల్మ్ ఇది.
ఇందులో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో హీరో గోపీచంద్ నటిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా `విక్కీస్ ఫస్ట్ యారో` పేరుతో చిత్ర బృందం ఓ ప్రత్యేకమైన వీడియో ను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గోపీచంద్ నటిస్తున్న 30వ సినిమా ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఓ చక్కని సందేశాన్ని జోడించి ఈ మూవీని రూపొందిస్తున్నారు.
అత్యుత్తమ సాంకేతిక విలువలతో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. భూపతిరాజా కథ వెట్రి పళని స్వామి ఛాయాగ్రహణం మిక్కి జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో సచిన్ ఖేడ్కర్, నాజర్, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తదితరులు నటిస్తున్నారు. 2023 సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.













