HomeTelugu Trendingరజనీకాంత్‌కు విలన్‌గా టాలీవుడ్‌ యంగ్‌ హీరో!

రజనీకాంత్‌కు విలన్‌గా టాలీవుడ్‌ యంగ్‌ హీరో!

5 4
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా ‘దర్బార్’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్‌టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తరవాత రజిని అజిత్ డైరెక్టర్ శివతో సినిమా చేస్తున్నాడు. గతంలో శివ వరుసగా అజిత్ తో సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మీనా ఖుష్బూ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా ఈ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ హీరో నటించనున్నాడని తెలుస్తుంది. డైరెక్టర్ శివ గతం లో రెండు తెలుగు సినిమాలు చేశారు. గోపీచంద్ హీరోగా ‘శౌర్యం’. ‘శంఖం’ అనే సినిమాలు చేసారు. ఆ పరిచయం తోనే గోపిచంద్‌ను రజినీకి విలన్ గా మార్చాలని చూస్తున్నారట. ఇక గోపీచంద్ విలన్ గా కెరియర్ ప్రారంభించి హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. కాగా హీరోగా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. దాంతో గోపీచంద్ కూడా విలన్ పాత్రకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!