HomeTelugu Trendingమగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా

మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా

gova beauty ileana welcomes

గోవా బ్యూటీ ఇలియానా తల్లి అయింది. ఆగస్టు 1న మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె ఇన్‌స్టాలో తెలియజేశారు. కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని నామకరణం చేసింది. ఆ చిన్నారి చిత్రాన్ని కూడా షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘మా డార్లింగ్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం. గుండె సంబరంతో నిండిపోయింది’ అంటూ ట్వీట్ చేశారు.

దీంతో అభిమానులు, స్నేహితులు, ఇలియానాకు పెద్దఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు. ఆ తరువాత జులైలో తన ప్రియుడి ఫొటోలను కూడా షేర్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!